ఎమ్మెల్యేల‌తో మన్నార్గుడి మాఫియా ఎక్స్ ట్రాలు!!

Posted February 9, 2017

anna dmk mlas are kidnapped
అన్ని వైపుల నుంచి వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంటున్న శ‌శిక‌ళ ముందు ఇప్పుడు రెండే ఆప్ష‌న్లున్నాయి. డూ ఆర్ డై. అందుకే ఆమె అన్నింటికి తెగించింది. ఏదో ఒకటి తేల్చుకునేందుకు సిద్ధ‌మైపోయింది. ఇందుకోసం ఎంత రిస్క్ అయినా ఓకే అంటోంది.

నిజానికి ఒక రాష్ట్ర‌ప్ర‌భుత్వం నిల‌బ‌డాలంటే ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు చాలా అవ‌స‌రం. అలాంటి ఎమ్మెల్యేల‌ను బుజ్జ‌గించి త‌న దారిలోకి తెచ్చుకోవాలి. కానీ శ‌శిక‌ళ మాత్రం వారిని భ‌య‌పెట్టి త‌న దారిలోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని టాక్. చాలామంది ఎమ్మెల్యేలను క్యాంపులో పెట్టి ఒత్తిడి తెస్తున్నార‌ట‌. ఎలాగైనా మ‌ద్దతివ్వాల్సిందేన‌ని స్ప‌ష్టం చేస్తున్నార‌న్న లీకులు వ‌స్తున్నాయి. చాలామంది ఎమ్మెల్యేల ఫోన్ల‌ను లాక్కున్నార‌ట‌. ఎవ‌రూ బ‌య‌ట ప్ర‌పంచంతో మాట్లాడ‌కుండా ఆంక్ష‌ల పెట్టార‌ట‌.

క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేల‌పై మన్నార్గుడి మాఫియా జులుం చేస్తోంద‌ట‌. చిన్న‌మ్మ‌కు జై కొడితే…. ఒకే లేక‌పోతే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నార‌ని టాక్. ఇప్ప‌టికే సెల్వంకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేల లిస్టు త‌యారైంద‌ట‌. క్యాంపులో ఆ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉదో లిస్టును రెడీ చేశార‌ట‌. అలాంటి వారంద‌రినీ ప్ర‌త్యేకంగా ఉంచి… క్లాసు తీసుకుంటున్నార‌ని స‌మాచారం.

క్యాంపు రాజ‌కీయాలు ఓకే గానీ… మ‌రీ ఇలా స్కూలు పిల్ల‌ల‌ను బెదిరించిన‌ట్టు ..ఎమ్మెల్యేల‌కు వార్నింగ్ ఇవ్వ‌డ‌మేంట‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వారి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డి ఓకే అన్నా… అస‌లు టైంలో స‌పోర్ట్ ఇవ్వ‌క‌పోతే ఈ ప్ర‌య‌త్నం అంతా వేస్టే. ఈ లాజిక్ ను చిన్న‌మ్మ మిస్ అవుతున్న‌ట్టుంది. లాజిక్ మిస్ అయ్యిందంటే ప్లాన్ రివ‌ర్స్ అయిన‌ట్టే. మ‌రి ఇప్ప‌టికైనా శ‌శిక‌ళ‌కు అది బోధ‌ప‌డుతుందో… లేదో!!!