అన్నాడీఎంకే లో చీలిక..29 న ముహూర్తం?

Posted December 26, 2016

annadmk dividing in 29th
తమిళ నాడు రాజకీయాలు ఉన్నట్టుండి వేడెక్కాయి.శశికళ దూకుడుకి అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం ఐటీ ని ప్రయోగించిందన్న వార్తలు వచ్చాయి . …అయితే అంతకుముందు పార్టీ పగ్గాలతో పాటు సీఎం పీఠం కూడా తనకే దక్కాలని శశి అడుగులు కదిపారు.అందుకే పార్టీలో ఆమె వర్గం అనుకున్నవాళ్లంతా సీఎం పీఠం కూడా శశికళకే దక్కాలని బహిరంగ ప్రకటనలు చేశారు .పోయెస్ గార్డెన్ కి వెళ్లి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోవాలని శశికళకి విజ్ఞాపనలు చేశారు.ఈ దూకుడుకి అడ్డుకట్ట వేయమని సీఎం పన్నీర్ సెల్వం కేంద్రానికి మొరపెట్టుకున్నారు.ఆ తర్వాతే ఐటీ దాడులు మొదలయ్యాయి. దీంతో పన్నీర్ మీద శశి వర్గం మండిపడుతోంది.ఈ నెల 29 న అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశం లో ఇదే అంశాన్ని ప్రస్తావించి పన్నీర్ ని సీఎం పీఠం నుంచి తప్పించాలని శశి వర్గం భావిస్తున్నట్లుంది.

అటు సీఎం పన్నీర్ సెల్వం అనుచరులు కూడా శశికళ వ్యూహాలకి కౌంటర్ ప్లాన్ చేస్తున్నారు. అన్నాడీఎంకే లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి,సీఎం ఒకరే ఉండాలన్న శశి వర్గం అస్త్రం ప్రయోగించబోతున్న విషయం వాళ్ళు పసిగట్టారు.ఇప్పుడే అదే అస్త్రాన్ని 29 న జరిగే సమావేశంలో ఎదురు ప్రయోగించాలని సెల్వం అనుచరులు అనుకుంటున్నారు.పార్టీ పగ్గాలు కూడా పన్నీర్ కే వాళ్ళు డిమాండ్ చేయబోతున్నారు.రెండు వర్గాలు ఒకే అస్త్రం ప్రయోగిస్తే పార్టీలో చీలిక తప్పేట్టు లేదు.