ఫోకస్ అంతా అనుష్క మీదేనా..?

Posted December 21, 2016

Anushka Crusial Role In Nagarjuna Om Namo Venkatesayaస్వీటీ అనుష్క ఈ మధ్య బాహుబలి సైజ్ జీరో తర్వాత కనిపించలేదు. అయితే ప్రస్తుతం సింగం సీక్వల్ ఎస్-3తో రాబోతున్న అనుష్క బాహుబలి-2, నమో వెంకటేశాయ సినిమాల్లో కీలక రోల్స్ చేస్తుంది. ఇక నమో వెంకటేశాయలో అయితే నాగార్జున మెయిన్ లీడ్ అయినా సరే అనుష్క పాత్రకు చాలా ఇంపార్టెంట్ ఉందట. కృష్ణమ్మగా కనిపించబోతున్న అనుష్క కేవలం సినిమాలో ఒక్క పాత్రలోనే కాదు నాలుగు డిఫరెంట్ క్యారక్టర్స్ లో నటిస్తుందట. ఈమధ్యనే ఈ సినిమాకు సంబందించిన కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ అన్ని సర్ ప్రైజ్ గా ఉన్నాయి.

కె.రాఘవేంద్ర రావు డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా సాయి కృప క్రియేషన్స్ లో మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. హతిరాం బాబా బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాలో అనుష్కతో పాటుగా ప్రగ్యా జైశ్వాల్, విమలా రామన్ కూడా నటిస్తున్నారు. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క భక్తి రస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నాగార్జున ఈ సినిమాతో ఎలాంటి ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. ఈ నెల 24న టీజర్ రిలీజ్ చేస్తున్న నమో వెంకటేశాయ సినిమాను ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.