దేవసేనను తట్టుకోవడం ఏ ఒక్కరి వల్ల కాదు!

0
91

 

 posted May 20, 2017 at 13:47

anushka expected in more budjet to movies

‘బాహుబలి’ మొదటి పార్ట్‌లో పెద్దగా అనుష్క పాత్ర లేక పోవడంతో ఆమె అభిమానులు కాస్త నిరాశ చెందారు. అయితే సెకండ్‌ పార్ట్‌లో ఆమె నట విశ్వరూపం చూపించి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అద్బుతమైన నటనతో పాటు యువరాణిగా అనుష్క అలరించిన తీరుపై విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. దాంతో అనుష్క రేంజ్‌ అమాంతం పెరిగి పోయింది. ప్రస్తుతం అనుష్క ఏ సినిమా ఒప్పుకోవాలన్నా కూడా మూడు నుండి నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్‌ చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

‘బాహుబలి’ తర్వాత అనుష్క నటించిన సినిమా ‘భాగమతి’. అశోక్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం కోసం అనుష్క ఏకంగా మూడు కోట్ల పారితోషికం అందుకుంది. ‘బాహుబలి 2’ విడుదల కాకముందే మూడు కోట్లు తీసుకున్న అనుష్క ఇప్పుడు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు అయితే అయిదు కోట్లకు తక్కువ తీసుకోను అంటూ చెబుతుందట. ప్రస్తుతం సౌత్‌ సినిమా నిర్మాతలే కాకుండా బాలీవుడ్‌ ప్రముఖ ఫిల్మ్‌ మేకర్స్‌ కూడా ఈమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాని అనుష్క పారితోషికంతో పువురు నిర్మాతలు ఇప్పటికే వెనుకడుగు వేశారు. అనుష్క పారితోషికంను తట్టుకోవడం అంత సులభం కాదు అంటూ టాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.