మహానటి స్థాయి మరీ పెంచేస్తున్నారు

0
31

Posted April 19, 2017

anushka keerthy suresh and samantha to do in savitri biopic movie
తెలుగు మరియు తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించి మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి జీవిత కథ ఆధారంగా ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ అల్లుడు నాగ్‌ అశ్విన్‌ సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెల్సిందే. గత సంవత్సర కాలంగా ఈ ప్రాజెక్ట్‌ కోసం ఆయన తపన పడుతున్నాడు. ఇటీవలే ‘మహానటి’ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. మహానటి సావిత్రి పాత్రను తమిళం మరియు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకు పోతున్న కీర్తి సురేష్‌ను ఎంపిక చేయడం జరిగింది. ఇక మరో ముఖ్యపాత్రలో సమంతను ఎంపిక చేయడం జరిగింది.

వీరిద్దరితో పాటు ఇంకా ఈ సినిమాలో హేమా హేమీలు నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. మహానటి సినిమా కోసం తాజాగా స్టార్‌ హీరోయిన్‌ అనుష్కను సంప్రదించడం జరిగింది. సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకు ఆమెను దర్శకుడు అనుకుంటున్నాడు. అందుకు అనుష్క కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మరో ముఖ్యమైన పాత్రను ప్రకాష్‌ రాజ్‌తో చేయించబోతున్నారు. ఇంకా ముందు ముందు మరెందరు నటీనటులు ఈ సినిమాలో భాగస్వామ్యం అవుతారో అని ఆసక్తిగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనుష్క ఎంట్రీతో ‘మహానటి’ ప్రాజెక్ట్‌ క్రేజ్‌ ఖచ్చితంగా మరింత పెరిగినట్లయ్యింది. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి తెరకెక్కబోతున్న ఈ సినిమా వచ్చే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.