అనుష్కకు ఎంత పెద్ద కష్టం వచ్చింది

0
64

Posted April 22, 2017 at 12:02

anushka says about her body fat
‘సైజ్‌ జీరో’ చిత్రం కోసం అనుష్క ఏ హీరోయిన్‌ చేయని సాహసం చేసింది. హీరోయిన్‌ అంటే నాజూకుగా, అందంగా కనిపించేందుకు కష్టపడుతుంది. కాని ఆ సినిమా కోసం అనుష్క కష్టపడి భారీ లావు అయ్యింది. సైజ్‌ జీరో కోసం అనుష్క అంత కష్టపడ్డా కూడా ఫలితం దక్కలేదు. బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డ విషయం తెల్సిందే. అప్పటి నుండి కూడా అనుష్క బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా కూడా బరువు తగ్గలేక పోతుంది. ఇంకా అనుష్క 20 కేజీల వరకు బరువు తగ్గాల్సి ఉందట.

తాజాగా ‘బాహుబలి 2’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా అనుష్క మాట్లాడుతూ తాను బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో అనుష్క బరువు తగ్గి నటించాల్సి ఉన్నా కూడా ఎంత ప్రయత్నించినా కూడా బరువు తగ్గలేదు. దాంతో చేసేది లేక అంతే నటించింది. సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత కూడా తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాని అవి సఫలం అవ్వడం లేదు. దాంతో అనుష్క ఇక గ్లామర్‌ రోల్స్‌కు గుడ్‌ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చినట్లే అని విశ్లేషకులు అంటున్నారు. ఆ 20 కేజీలు తగ్గితే తప్ప అనుష్క హీరోయిన్‌గా మళ్లీ నటించే అవకాశాలున్నాయి. లేదంటే హీరోయిన్‌ ఓరియంటెడ్‌ పాత్రతో కెరీర్‌ను నెట్టుకు రావాల్సిందే.