ఎవ‌రైనా త‌న‌కు భ‌య‌ప‌డాల్సిందేనంటున్న నాగార్జున‌!!

Posted November 27, 2016

Image result for nagarjuna acting raju gari gadhi movie

అక్కినేని నాగార్జున ఇప్పటివ‌ర‌కు తాను ఎప్పుడూ చేయని కొత్త జోన‌ర్ లోకి అడుగు పెట్ట‌బోతున్నారు. ఆయ‌న కెరీర్ లో తొలిసారిగా ఓ హార్ర‌ర్ సినిమాలో నటించ‌బోతున్నారు. టాప్ డైరెక్ట‌ర్స్ లిస్టులో లేని ద‌ర్శ‌కుడితో ఈ సినిమా చేయబోతుండ‌డం విశేషం. ఇంత‌కీ ఆ సినిమాకు డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా. రాజుగారి గ‌దితో ఆక‌ట్టుకున్న డైరెక్ట‌ర్ ఓంకార్.

రాజుగారి గ‌దితో డైరెక్ట‌ర్ గా ఓంకార్ కు మంచి మార్కులు ప‌డ్డాయి. దానికి సీక్వెల్ తీయ‌డానికి ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క‌థ‌ను నాగార్జున‌కు వినిపించ‌డం. ఆయ‌న కూడా ఓకే చెప్ప‌డం చ‌కా చ‌కా జ‌రిగిపోయాయి. దీంతో ఈ ప్రాజెక్టు ఇప్పుడు ప‌ట్టాలెక్కింది. రాజుగారి గ‌ది-2 పేరుతో షూటింగ్ కూడా ప్రారంభ‌మైంది. త‌న‌కు ఈ క్యారెక్ట‌ర్ బాగా న‌చ్చింద‌ని నాగార్జున చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో సినిమాపై ఇప్ప‌ట్నుంచే అంచ‌నాలు పెరిగాయి.