చంద్ర‌బాబును హైద‌రాబాద్ మ‌ళ్లీ ఏడిపిస్తుందా?

Posted November 24, 2016

ap assembly meetings
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌నను మొత్తం అమ‌రావ‌తికి త‌ర‌లించేశారు. ఇక శాస‌న‌స‌భకు కూడా అక్క‌డే భ‌వ‌నాల నిర్మాణం కొన‌సాగుతోంది. ఈనేప‌థ్యంలో మొన్నా మ‌ధ్య తెలంగాణ‌లో చిట్ట‌చివ‌రి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలంటూ బాబు అండ్ కంపెనీ హ‌డావుడి చేసింది. వీడ్కోలు స‌భ లాగా చంద్ర‌బాబు మొద‌లుకొని నేత‌లంతా దాదాపు క‌న్నీరు పెట్టుకున్నంత ప‌నిచేశారు. నాటి తీపి గుర్తుల‌ను త‌ల‌చుకుంటూ పెద్ద సెంటిమెంటును పండించారు.

అసెంబ్లీ స‌మావేశాల‌కు త్వ‌ర‌లోనే స‌మ‌యం ఆసన్న‌మ‌వుతోంది. స‌మ‌యం కొంతే ఉంది కానీ ఇప్ప‌టిదాకా అమ‌రావ‌తిలో శాస‌న‌స‌భకు కావాల్సిన భ‌వ‌న నిర్మాణం కొలిక్కి రాలేదు. దీంతో విధి లేని ప‌రిస్థితుల్లో హైద‌రాబాద్ లోనే శాస‌న‌స‌భ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఈసారి హైద‌రాబాద్ లో స‌మావేశాలు జ‌ర‌గ‌డం.. స‌మావేశాల ముగింపు స‌మ‌యంలో మ‌రోసారి సెంటిమెంటు సీన్లు క‌నిపించ‌నున్నాయి. మ‌ళ్లీ ఒక‌సారి వీడ్కోలు స‌భ ఉంటుందా?… ఉంటే ఏపీ సీఎం చంద్ర‌బాబు భావోద్వేగానికి లోనై.. మ‌రోసారి క‌న్నీరు పెట్టక తప్ప‌దా ? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.