అమెరికాలో ఏపీ బృందం ఏమి నేర్చుకుంది?

 Posted November 1, 2016

ap central command control officers learn to new york central command control
ఏపీ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయి.ఇప్పటికే వినియోగంలో ఉన్న ఏపీ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ పనితీరు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకునేందుకు ఓ ఉన్నత స్థాయి బృందం అమెరికా వెళ్ళింది.ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన న్యూయార్క్ పోలీస్ కమాండ్ సెంటర్ ని సందర్శించింది.ఆ కమాండ్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న స్టీవ్ రాబర్ట్ రాష్ట్ర బృందానికి తమ పనితీరు ,అందుకోసం కమాండ్ సెంటర్ ని సమర్ధంగా ఉపయోగించుకున్న విధానాల్ని వివరించారు.నేరాల అదుపు ,క్రిమినల్స్ గుర్తింపు కోసం అనుసరిస్తున్న ఆధునిక విధానాల్ని కూడా రాష్ట్ర బృందం అధ్యయనం చేసింది.

ఏపీ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ హెడ్,పౌరసరఫరాల కమిషనర్ బి.రాజశేఖర్,ఐటీ శాఖ కార్యదర్శి పి.ఎస్.ప్రద్యుమ్న ,ఏపీ ఫైబర్ నెట్ ఎండీ కే.సాంబశివరావు ,సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు న్యూయార్క్ వెళ్లిన బృందంలో వున్నారు.మూడు రోజుల కిందట అమెరికా వెళ్లిన ఈ బృందం ఈ నెల 5 దాకా ఇదే అంశంపై అధ్యయనం చేస్తుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పుష్కరాల వంటి సందర్భాల్లో సెంట్రల్ కమాండ్ వ్యవస్థను ఉపయోగించారు.ఈ వ్యవస్థతో పాలనా పరంగా గరిష్ట ప్రయోజనం పొందాలన్న ఉద్దేశంతో ఆయనే ఈ పర్యటనకి చొరవ తీసుకున్నట్టు తెలుస్తోంది.