ఏపీ ప్రభుత్వం సింధుకు భారీ ఆఫర్ ప్రకటన…

0
103

 ap govt giving big offer pv sindhuవిజయవాడ: ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధూను తగిన రీతిలో గౌరవించాలని నిర్ణయించిన ఏపీ కేబినెట్ సింధును అభినందిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సింధుకూ రూ.కోట్ల నగదు బహుమతితో పాటు రాజధానిలో వెయ్యి గజాల స్థలంతో పాటు గ్రూప్ వన్ స్థాయిలో ఉద్యోగం ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.

అలాగే సింధును ఒలింపిక్స్ స్థాయిలో తీసుకెళ్లిన కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.50 లక్షల నగదును ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే ఏపీలో గోపీచంద్ అకాడమీ ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చేలా ప్రతిపాదించాలని కేబినెట్ నిర్ణయించింది. సింధు ఇండియాకు వచ్చిన వెంటనే విజయవాడలో సన్మాన సభ ఏర్పాటు చేసి ప్రభుత్వ నజరానాను ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు సింధు తండ్రి రమణకు లేఖ రూపంలో అందజేయాలని నిర్ణయించారు.