రెండు రాష్ట్రాలలో భారీగా వర్షాలు…

  ap telangana states full rainingతెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. కడప జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దువ్వూరు- 22.4 సెం.మీ, సింహాద్రిపురం-15.4, ప్రొద్దుటూరు- 14.3, చాపాడు-13, మైదుకూరు-9, మైలవరం-8.4, జమ్మలమడుగు-8, రాజుపాలెం-8.5, కొండాపురం- 7.4, పులివెందులలో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమో దు అయింది. కృష్ణా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద వచ్చి చేరుతోంది.పులిచింతల ప్రాజెక్టుకు 9 టీఎంసీలు నీరు చేరింది. మరో పది టీఎం సీల నీరు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పట్టీసీమ పంపులను అధికారులు నిలిపివేశారు. పోలవరం కుడికా లువ ద్వారా నీటి సరఫరాను కూడా అధికారులు నిలిపివే శారు. తిరుమలలో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని 10 కిలోమీటర్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సమయంలో రోడ్డుపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విష యం తెలిసిన ఆలయ ఇంజనీరింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో బండరాళ్లను తొలగిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. అనంతపురం జిల్లావ్యాప్తంగా మంగళవారం భారీ వరం కురిసింది. 26 మండలాల్లో విడవకుండా వర్షం పడ డంతో జనజీవనం స్తంభించింది. తాడిపత్రిలో 66.4, యల్లనూరులో 62.4, పుట్లూరులో 48, కూడేరులో 45.2, బుక్కరాయసముద్రంలో 41, అనంత పురం పట్టణంలో 41 మిల్లీమీటర్ల నమోదైందని అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ వర్షపాతం వివరాలు : నంద్యాల-19 సెం.మీ, బద్వేలు-11, కైకలారు-12 సెం.మీ, పగిడ్యాల, తాడిపత్రి, మాచర్ల, తాడేపల్లిగూడెం-7 సెం.మీ వర్షపాతం నమోదైంది. సత్తెనపల్లి-9, ఒంగోలు, పోలవరం, భీమడోలు-6 సెం.మీ వర్షపాతం నమోదైంది. జూపాడుబంగ్లా, నందికొ ట్కూరు, పిడుగురాళ్ల, వేలేరుపాడు-5 సెం.మీ, వీర్‌పురం, ఓర్వకల్, కోయిల కుంట్ల, బనగానపల్లి, ముద్దనూరు-4 సెంమీ వర్షపాతం నమోదైంది.
తెలంగాణ వర్షపాతం వివరాలు : కొల్లాపూర్-16, నాగర్‌కర్నూలు-11, వెంకటాపురం-7 సెం.మీ, మక్తాల్-7, తిమ్మాపూర్, మధిర-5 సెం.మీ వర్ష పాతం నమోదైంది. చెన్నూరు, అశ్వరావుపేట, తిమ్మాజీపేట-4 సెంమీ, నాగార్జునసాగర్, ములుగు-3 సెంమీ వర్షపాతం నమోదైంది.