సెట్స్ పైకి “అబ్దుల్ కలాం” బయోపిక్

 Posted February 15, 2017

apj abdul kalam biopic movieటాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్న బేధం లేకుండా అన్ని వుడ్ లలోనూ బయోపిక్ ల హవా పెరిగిపోయింది. సమాజానికి సేవలందించిన వారి చరిత్రను తెలియజేయడంతో పాటు కాసులు కూడా రాలుతుండడంతో ఈ బయోపిక్స్ ని తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు సైతం ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తాజాగా మరో బయోపిక్ తెరకెక్కనుంది.

ఒక శాస్త్రవేత్తగా, భారత మాజీ రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన ఏపీజే అబ్దుల్‌ కలాం జీవితం ఆధారంగా ఓ బయోపిక్ ను రూపొందిస్తున్నారు. అనిల్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   ‘డాక్టర్‌ అబ్దుల్‌ కలాం’ అనే పేరుతో తెరకెక్కనున్న ఆ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను చిత్ర బృందం ఈ రోజు  విడుదల చేసింది. సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ఈ విషయాన్ని ట్విట్టర్  ద్వారా తెలిపారు. ఈ ఫస్ట్‌ లుక్‌ లో.. నింగిలోకి పీఎస్‌ఎల్వీ-సీ37ను ప్రవేశపెట్టి రికార్డు బ్రేక్‌ చేసినందుకు ఇస్రోకు శుభాకాంక్షలు అని రాసి ఉంది. ఇంగ్లిషులో రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుందని ఆదర్శ్ పేర్కొన్నారు.