జయ డిశ్చార్జ్ ఎప్పుడంటే?

 Posted November 4, 2016

apollo chairman prathap reddy says about jayalalitha discharge timeతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిశ్చార్జ్ విషయంపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. ఆమెని ఓ నాలుగు వారాల్లో డిశ్చార్జ్ చేస్తామని అపోలో చైర్మన్ ప్రతాప రెడ్డి స్వయంగా ప్రకటించారు. జయ ఆరోగ్యం మెరుగుపడిందని …ఆమె చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని అర్ధం చేసుకుంటున్నారని …అవసరమైనవి అడుగుతున్నారని అయన చెప్పారు.ఓ రెండు రోజుల్లో ఆమెను క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి రూమ్ కి మారుస్తున్నట్టు ప్రతాప్ రెడ్డి వివరించారు. అయన ప్రకటన తర్వాత అన్నాడీఎంకే శ్రేణులు,అమ్మ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.