ఆ డైరెక్టర్ మహేష్ ని తెగ మెచ్చుకున్నాడు..

  ar murugadass praise mahesh attitudeమహేష్ లీడ్‌లో మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. న్యాయవ్యవస్థ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఓ తమిళ పత్రికతో మురుగదాస్ మాట్లాడుతూ, మహేష్ గురించి ప్రస్తావించాడు. ఒక సీన్ గురించి చెబుతున్నప్పుడు మహేశ్ ఎంతో శ్రద్ధ పెట్టి వింటారని చెప్పాడు. ఆ సన్నివేశం చేశాక ఆయన తన వైపు చూస్తారనీ, తనలో ఏ మాత్రం అసంతృప్తి కనిపించినా ఆయనే నెక్స్ట్ టేక్ కి వెళదామని చెబుతాడని చెప్పుకొచ్చాడు. మహేష్ గొప్పనటుడనీ .. ఆయన అంకితభావాన్ని ఈ మూవీ ద్వారా చూడగలిగానని అన్నాడు. సెట్లో  ఆయన చాలా హుందాగా నడచుకుంటారంటూ మహేష్‌ను ప్రశంసించాడు.