స్టైలిష్ విలన్.. హీరోగా బిజీ బిజీ

Posted October 8, 2016

 aravind swamy again acting hero

ఈ మ‌ధ్యే విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అర‌వింద్ స్వామి.. మళ్లీ హీరోగా బిజీ బిజీ అయిపోతున్నాడు. ‘త‌నీ ఒరువ‌న్‌’లో విల‌న్‌గా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు ఈ సీనియర్ హీరో. దీంతో తెలుగులో రీమేక్ అవుతున్న ‘ధృవ’లో కూడా అదే పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఈ స్టయిలీష్ విలన్ మళ్లీ హీరోగా మారబోతున్నాడు.

ఇప్పటికే ‘స‌దురంగ వెట్ట‌య్’ సీక్వెల్‌ ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి ప్రక్కన త్రిష జతకట్టనుంది. తాజాగా, మరో రెండు చిత్రాలని లైన్లో పెట్టేశాడు.. ఈ సీనియర్ హీరో. మ‌ల‌యాళంలో ‘భాస్క‌ర్ ది రాస్కెల్‌’లతో పాటుగా.. ర‌మ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. స్వామి దూకుడు చూస్తుంటే.. హీరోగా కెరిర్ తొలినాళ్లలో తెచ్చిపెట్టిన క్రేజ్ ని మళ్లీ సొంతం చేసుకునేలా ఉన్నాడు.

అప్ప‌ట్లో రోజా’, ‘బొంబాయి’ సినిమాలు చేసిన కాలంలో అరవింద్ స్వామి మహిళల కలల రాకుమారుడు. లవ్వర్ భాయ్ ముద్రపడటంతో స్వామికి లేడీస్ ఫాలోయింది విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని కారణాల వల్ల  సినిమాలకి దూరం అయ్యాడు.. కానీ, లేకపోతే స్టార్ హీరో క్రేజ్ ఇప్పటికి కంటిన్యూ చేసేవాడే.