ప్యాకేజ్ పై పీటముడి..బాబు అలక?

0
139

 arun jetly silent ap special status package babu very sad
వారం రోజుల్లో తీపి కబురు వింటారంటూ ఆంధ్ర ప్రజల్ని ఊరించిన కేంద్ర ఆర్ధిక మంత్రి మళ్లీ ఎందుకు సైలెంట్ అయ్యారు ? దీనికి కారణం ఏపీ సీఎం చంద్రబాబు అని తెలుస్తోంది.హోదాపై ఎంత ఒత్తిడి వచ్చినా ప్యాకేజ్ తోటే పని పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోందట .దానికి సంబంధించిన కసరత్తు కూడా కొంతవరకు చేశారట .అందులో భాగంగా సంప్రదింపులు జరిపినపుడు సీఎం చంద్రబాబుకి కేంద్రం ఇవ్వదల్చుకున్న ప్యాకేజ్ వివరాలు చూచాయగా అర్ధం అయ్యాయట .అది ఆంధ్ర ఆశిస్తున్నట్టు లేకపోవడంతో ఇలాగైతే మాకు OK కాదని కేంద్రపెద్దలతో చెప్పారట .

ప్రతిసారి ఇలాగే చేస్తున్నారని చంద్రబాబు అలకబూనారట.విషయం తెలిసిన ఢిల్లీపెద్దలు ఈ అంశాన్ని త్వరగా ,సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నాలు ప్రారంభించారట.అయితే ఆంధ్రాకి భారీ ప్యాకేజ్ ప్రకటిస్తే మిగతా రాష్ట్రాలనుంచి వచ్చే ఒత్తిళ్ల గురించి కమలనాధులు ఆదోళన పడుతున్నారంట.యూపీ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు పార్టీకి చేటు చేస్తాయేమోనన్న భయం వారిది..హోదా రాకపోయినా కనీసం భారీ ప్యాకేజ్ తేలేకపోతే అసలుకే మోసం వస్తుందని బాబు కలవరం .చూద్దాం ఈసారైనా బాబు అలక పనిచేస్తుందేమో !