ఇప్పుడిక  ట్రిపుల్ తలాక్ వంతు..?

Posted January 28, 2017

asaduddin owaisi says Muslims must fight for triple talaqజల్లికట్టు ఉద్యమ స్పూర్తితో ఏపి యువత ప్రత్యేక హోదా కోసం నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు అదే జల్లి కట్టు ఉద్యమ స్పూర్తితో ట్రిపుల్ తలాక్ ఉద్యమం తెరమీద కొచ్చింది. ట్రిపుల్ తలాక్ ను పలు ముస్లిం మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్‌ పై ఉద్యమం చేద్దామంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు పిలుపునిచ్చారు.

జల్లికట్టు ఉద్యమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా తల వంచాల్సి వచ్చిందని, తమిళుల్లాగే మనకు కూడా ప్రత్యేక సంస్కృతి ఉందని,  ముస్లింల పెళ్లిళ్లు, ట్రిపుల్ తలాక్ వంటి సంప్రదాయాల్లో ఎవరూ జోక్యం చేసుకోకుండా ఉండేలా పోరాడాలని వెల్లడించారు. పెళ్లళ్ల విషయంలో ఇలాగే ప్రవర్తించాలని తమకు ఎవరూ మార్గదర్శకాలు చెప్పాల్సిన అవసరం లేదని సూచించారు.