“అశ్వగంధ” కింగ్ అఫ్ ఆయుర్వేదం ఉపయోగాలు ..

Posted December 9, 2016

ashwagandha-450“king of Ayurveda” గా పేరు గాంచిన ఆయుర్వేద దివ్య ఔషదం అశ్వగంధ.ప్రతి మొక్కనీ మనం ఇష్టపూర్వకంగా శ్రద్దగా పెంచితే ‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాకుండా పోదు.అనేక రకాల మొక్కల్లో కొన్ని పొదలమాదిరిగా పెరుగుతాయి. అటువంటిదే అశ్వగంధ.మన భారతదేశంలో విస్తారంగా లభ్యమవుతుంది.ఆయుర్వేద వైద్యపరంగా అశ్వగంధి లేహ్యం గురించి తెలియని వారుండరంటే అతిశ యోక్తి కాదు. అశ్వగంధి మత్తు కలిగించే ఔషధంగాను, మంచి పుష్టినీ బలాన్ని చేకూర్చేదిగాను, ఉదరసంబంధవ్యాధులకు దివౌషధంగాను, జ్ఞాపక శక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగాను, ఎంతగానో ఉపయోగపడుతుంది. కేన్సర్‌కి దీనిని మించిన ఔషధం మరొకటి లేదంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కుంటున్న ఒత్తిడిని నివా రించడంలో దీనికిదే సాటి. నీరసాన్ని, నిస్త్రా ణని దగ్గరకి రానివ్వదు. కండరాల వ్యాధులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. విషాన్ని హరించే శక్తి దీనికి అమితంగా ఉంది.

అశ్వగంధి పొడిని పంచదారతో కలిపి నేతితో తీసుకుంటే నిద్రలేమి తగ్గి మంచి నిద్ర పడుతుంది. ఊబకాయాన్ని నియంత్రి స్తుంది. డిహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. ఎముకలకి మంచి బలాన్ని చేకూరుస్తుంది. పళ్ళని గట్టిపరుస్తుం ది. దంతక్షయాన్ని నిర్మూలిస్తుంది. కీళ్ళ నొపðలు నయం చేస్తుంది. దీని ఆకులు, వేర్లు, పుష్పాలు, కాయలు కురుపులకి, కడు పులో అల్సర్స్‌ని రాకుండా అదికడుతుంది, తగ్గిస్తుంది. మోకాళ్ళ నొప్పులకు ఇది మంచి ఔషధం. శరీర ధారుఢ్యాన్ని పెంపొందించ డంలో దీనికిదే సాటి. జీర్ణశక్తిని పెంపొంది స్తుంది. లివర్‌ సంబంధవ్యాధుల్ని అరికడు తుంది. కేన్సర్‌, అల్సర్‌ వంటి వ్యాధుల్ని సమూలంగా నిర్మూలిస్తుంది. కోల్పోయిన జ్ఞాపకశక్తిని తిరిగి ప్రసాదించే గుణం ఈ అశ్వగంధికే ఉంది. ఆయుర్వేద వైద్య విధా నాల్లో తయారవుతున్న అశ్వగంధారిష్టం, అశ్వగంధాది లేహ్యం, అశ్వగంధి లక్సడి మొదలైనవి ఏనాటినుంచో మంచి ప్రాచుర్యం పొంది, అధిక సంఖ్యలో ఎగుమతి అవుతు న్నాయి.
నరాలు వినాచనం కాకుండా కాపాడుతాయి .

అశ్వగంధ తో ఏ మందు తీసుకున్న దాని పనితనము మెరుగు పరుస్తుంది వైద్యపరంగా :కాన్సర్ జబ్బులు రాకుండా కాపుడు తుంది .నరాల నీరసాన్ని తగ్గిస్తుంది ,రక్తపోటు , మదుమేహ వ్యాధుల నియంత్రణలో సహకరిస్తుని .

చెడు ప్రభావం కూడా : ఎక్కువ మోతాదులో రోజులు వాడితే గుండెపైన , అడ్రినల్ గ్రాందుల పైన చేడుప్రభావము చూపుతుంది.థైరాయిడ్ గ్రంధి ని ఉత్తేజ పరిచి “Hyperthyroid”జబ్బుకి దారితీస్తుంది..