మోడీ దెబ్బకు జ్యోతిష్యుల మందు ..?

Posted November 22, 2016

astrologer business increase because of modi banned 500 1000 rs notesబ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు మాత్రమే జనం క్యూలు కట్టడం లేదు. ఆన్‌లైన్‌ జాతక ఫలితాల కోసం కూడా క్యూలు కడుతున్నారట . దిన, వార రాశి ఫలాలతోపాటు, బ్రహ్మరాత, హస్తవాసి , భవిష్యత్ ఎరుక చెబుతామంటూ ఇటీవలనే ఆన్‌లైన్‌లో వెలసిన జ్యోతిష్కులు, సంఖ్యాశాస్త్ర పండితులు అదరగొడుతున్నారు. అంతే కాదండోయ్ తమ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయన్నదే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో కూడా చెప్పాలంటూ ప్రజలు వారి వెంట బడుతున్నారట

నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్టు వుంది వీరి వ్యాపారం 40 నుంచి 50 శాతానికి పెరిగిందని ఆస్క్మాంక్ డాట్ ఇన్, మాంక్వ్యాసా డాట్ కామ్, ఐజోఫి డాట్ కామ్, ఆస్ట్రోబడ్డీ లాంటి ఆన్‌లైన్ జాతక సంస్థలు తెలియజేస్తున్నాయి. ఇంతకుముందు అరా కోరగా కాల్ చేసే కస్టమర్లు, పెద్ద నోట్లు రద్దయిన నాటి నుంచి కాల్స్ బాగా వస్తున్నాయని అంటున్నారు వ్యక్తిగత వ్యాపార లావాదేవీలు, ఆర్థిక పరిస్థితులతోపాటు ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పు ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశంపై కూడా ప్రశ్నలు అడుగుతున్నారట ఐతే వీరి లో ఎక్కువ కిరాణా వ్యాపారులు.

తమ కుటుంబం చిన్నాభిన్నమైందని, ఆర్థికంగా కుంగిపోయామని, వ్యాపారంలో భారీగా నష్టం వచ్చిందని, దీనికి పరిష్కారం చూపించాలంటూ….ఆర్థిక ఇబ్బందుల వల్ల సరకు సకాలంలో సరకు సరఫరా చేయకపోవడం వల్ల తనపై ఎఫ్ఐఆర్ దాఖలైందని, ఇప్పుడు తనకు శిక్ష పడుతుందా? శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి?……అప్పుల్లో పీకలోతు వరకు కూరుకుపోయాను. బయట పడాలంటే ఏం చేయాలి? లాంటి ప్రశ్నలు కూడా కస్టమర్ల నుంచి వస్తాయని పలు జాతక సంస్థలు తెలియజేస్తున్నాయి.

కస్టమర్లు అడిగే ఒక్కో ప్రశ్నకు, సూచించే పరిష్కారానికి ఈ జాతక సంస్థలు 300 నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తాయి. ఈ సంస్థలు సాధారణ పశ్నలకు 300 నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తే, కీలకమైన ప్రశ్నలకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాయి. ప్రశ్నలడిగే ప్రజల జాతకాలు ఎలా ఉన్నా ప్రస్తుతం ఈ ఆన్లైన్ జాతక సంస్థల జాతకాలు మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి..ఇదే అంటారు దరిద్రం లో ఉన్న అదృష్టవంతుడిని ఎవరు చెడకొట్టలేరు అని .