రాజమౌళి హిట్…ఆ సోషల్ మీడియా స్వామి జాతకం?

0
112

 Posted April 28, 2017 at 13:46

astrologer venu swamy predict rajamouliబాహుబలి ది కంక్లూజన్ ఏ స్థాయి విజయం సాధిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే …సోషల్ మీడియా వేదికగా సంచలన జ్యోస్యాలు చెప్పే ఓ స్వామి మాత్రం వింతైన వ్యాఖ్యానం చేశారు.ఆయనే వేణు స్వామి. ఎప్పుడు ఏ టాపిక్ మీద చర్చ జరుగుతుంటే దానిపై యు ట్యూబ్ ఛానల్ లో జాతకం చెప్పేస్తాడు ఈ స్వామి.ఆయన కన్ను ఈ మధ్య రాజమౌళి,ఆయన తీస్తున్న సినిమా మీద పడింది.అయితే ..బాహుబలి 2 సక్సెస్ అవుతుందో,లేదో సూటిగా చెప్పకుండా మే 2 తర్వాత రాజమౌళి జాతకం తిరగబడుతుందని చెప్పి అందరిలో సినిమా మీద డౌట్ లేపాడు. మరో ఏడు సంవత్సరాల పాటు రాజమౌళికి సక్సెస్ రాదనీ కూడా వేణు స్వామి జోస్యం.జనానికి రాజమౌళి మీద నమ్మకం వున్నా ఆ స్వామి మాటలు వింటే ఎక్కడో అనుమానం .

బాహుబలి ది కంక్లూజన్ విడుదల అయ్యింది.సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.రాజమౌళి కంటి చూపు తమ మీద పడితే బాగుందని దేశం లోని టాప్ స్టార్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక నిర్మాతలు ఆయనకి బ్లాంక్ చెక్స్ ఇవ్వడానికి రెడీ గా వున్నారు. ఇంకేముంది …సోషల్ మీడియా స్వామి సీట్ చిరిగింది.ఇప్పుడు ఆ స్వామి తాను చెప్పిన మాటని మసిపూసి మారేడుకాయ చేయడానికి తెగ ట్రై చేస్తున్నాడట.ఇక ఆయన ఏమి చెప్పినా జరుగుతుందని నమ్మి జగన్ సీఎం అయ్యే డేట్ కోసం ఎదురు చూస్తున్న వైసీపీ క్యాడర్ కూడా తాజా రిజల్ట్ తో కంగుతింది.