ట్రంప్ గెలుపులో పిడకల వేట…

Posted November 9, 2016

astrologers said trump not won in american elections
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు దేశం కాని దేశంలో రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది.అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో .ఆ వర్గాలు మరేవో కావు…హేతువాదులు,జ్యోతిష్కులు.

ఎన్నికల ముందు పేపర్ లు చదివో,టీవీ లు చూసో చాలా మంది జ్యోతిష్కులు హిల్లరీ గెలుపు ఖాయమని ప్రకటించారు.ట్రంప్ గెలవడంతో వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.పైగా హేతువాదులు వీరి వెంటపడి ఆ జ్యోతిష్కులు ముందేమి చెప్పారు..ఇప్పుడేమి జరిగిందన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.దీంతో జ్యోతిష్కులు తలపట్టుకుంటున్నారు.ఈ ప్రచారం పెరిగితే అసలుకే ఎసరొస్తుందని వారు కంగారు పడుతున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి తప్పు తమదే కానీ జ్యోతిష్యానిది కాదని బహిరంగ ప్రకటన చేస్తున్నారు.ఇదే అదనుగా హేతువాద సంఘాలు,నాయకులు రెచ్చిపోయి పండితుల్ని కార్నర్ చేస్తున్నారు.ఇప్పుడు చెప్పండి …ఇదంతా ట్రంప్ గెలుపులో పిడకల వేట కాదంటారా?