నోరుజారిన అచ్చెన్నాయుడు!!

Posted March 18, 2017

atcham naidu comments on ap assembly facilities
అమరావతి అసెంబ్లీ భవన సముదాయంపై మంత్రి అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీలో సౌకర్యాలు సరిగా లేవని ఒక్కసారిగా ఆయనకు కోపమొచ్చేసిందట. ఇదేం అసెంబ్లీ? బాత్రూంలో నీళ్లు కూడా లేవు..!! ఇలా ఇంకా ఎన్నో ఘాటైన పదాలను వాడినట్టు సమాచారం.

చంద్రబాబు కేబినెట్ లోని నాయకుడు అసెంబ్లీలోని సౌకర్యాలపై నోరు జారడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. అసెంబ్లీ భవనాన్ని ఈ మధ్యే కొత్తగా నిర్మించారు. కాబట్టి ఇంకా వ్యవస్థ సెట్ కాలేదు. కొన్ని లోపాలు ఉండొచ్చు. అంతమాత్రాన నోటికొచ్చినట్టు మాట్లాడ్డం పద్ధతి కాదు. అందులోనూ అచ్చెన్న లాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడ్డం ఆశ్చర్యకరంగా ఉంది.

అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యల వెనుక పరమార్థం వేరే ఉందని ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నను చంద్రబాబు కేబినెట్ నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై డైరెక్ట్ గా ఏమీ అనలేక ఆయన ఇలా నోటికి పనిచెబుతున్నారన్న వాదన వినిపిస్తోంది. పార్టీ అధినాయకత్వంపై కోపంతో… ఫ్రస్ట్రేషన్ లోనే ఆయన నోరు జారారని టీడీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికే బాబు దగ్గర అచ్చెన్న మార్కులు తగ్గాయి. ఇలాంటి కామెంట్స్ తో ఆ మార్కులు మరీ మైనస్ లోకి వెళ్తే.. అసలుకే ఎసరొస్తుందని అచ్చెన్నను హెచ్చరిస్తున్నారు టీడీపీ లీడర్లు.