తమిళనాడు గవర్నర్‌కు న్యాయ సలహా ఇదే..

Posted February 13, 2017

Attorney General Mukul rohatgi advice to governor vidyasagar తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సీఎం పీఠం కోసం అధికార అన్నాడీఎంకే పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తొలగేందుకు తమిళనాడు ఇంఛార్జి గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావుకు అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గీ ముఖ్యమైన సలహా ఇచ్చారు. వారంలోగా శాసనసభలో బలపరీక్ష నిర్వహించాలని సూచించారు. బల పరీక్ష నిర్వహిస్తే మెజార్టీ ఎవరికి ఉందో స్పష్టమవుతోందని ఏజీ సూచించారు.

గత గురువారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళలతో విడివిడిగా భేటీ అయిన గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటు అంశంపై నిర్ణయాన్ని ఇంకా ప్రకటించకపోవడంతో తమిళనాట రాజకీయాల్లో తీవ్రఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే.