హీరోగా రెండో సినిమా కూడానా..!

Posted December 22, 2016

Avasarala Srinivas Second Chance As Hero For Vijay Movieఅవసరాల శ్రీనివాస్ ఇప్పుడిప్పుడే ఓ క్రేజ్ సంపాదించుకున్న నటుడు దర్శకుడు కూడాను.. రీసెంట్ గా జ్యో అచ్యుతానంద మూవీతో హిట్ అందుకున్న శ్రీనివాస్ హీరోగా కూడా మారాడు. బాలీవుడ్ అడల్ట్ కంటెంట్ బేస్డ్ మూవీ హంటర్ రీమేక్ గా తెలుగులో బాబు బాగా బిజీ సినిమా చేస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. అసలైతే రెజినాతో రొమాన్స్ చేయాల్సిన ఈ మూవీలో రెజినా బదులు మిస్తి చక్రవరిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు.

ఇక హీరోగా మొదటి సినిమా రిలీజ్ అవ్వనే లేదు కాని మరో సినిమాకు అవకాశాలు వస్తున్నాయట. విజయ్ అనే కొత్త దర్శకుడు చేసే సినిమాలో అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తెలుగులో ప్రస్తుతం నటుడు దర్శకుడు హీరోగా చేస్తున్న వారిలో అవసరాల శ్రీనివాస్ మాత్రం ప్రత్యేకం అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రెజినాను ఫైనల్ చేశారట. ఒక సినిమాలో రెజినాతో జతకట్టే మిస్ అయ్యానని అనుకున్న శ్రీనికి మరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. మరి హీరోగా అవసరాల శ్రీనివాస్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.