చేతులు కాలాక ..ఆకులు పట్టుకొన్నాం .. యాక్సిస్ బ్యాంకు

Posted December 19, 2016

axis bank in troubleచేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొన్నట్లుంది యాక్సిస్ బ్యాంకు తీరు..నోట్ల రద్దు తర్వాత యాక్సిస్ బ్యాంకు ఖాతాల్లో తేడాలున్నాయని గమనించిన అధికారులు ఆ ఖాతాల్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే..తాజాగా ఆ బ్యాంకు సీఈఓ శిఖ వర్మ ఖత దారులకు ఓ ఉత్తరం రాశారట దానిలో సారాంశం ఏమిటంటే 22 సంవత్సరాలుగా బోలెడు సేవ చేస్తూ ఉన్నాం నోట్ల రద్దు తర్వాత సిబ్బంది ఎవరో ఏదో చేశారు జరిగిన దాని మీద విచారణ జరిపిస్తున్నాం, ఇంకెప్పుడు ఇలా జరగదు అని.. రాసారు. ఒక డైరెక్టర్ హోదా లో ఆవిడ ఖాతా దారులకు లేఖరాయడం లో తప్పు లేదు.

కానీ సగటు ఖాతా దారుని ఆలోచనల్ని పరిశీలిస్తే గతానుభవం చుస్తే చార్మినార్ బ్యాంకు, అగ్రి గోల్డ్ వంటి సంస్థలు ఖాతా దారులకు టోపీ పెట్టిన సంస్థలే..నోట్ల రద్దు కారణం గా తర్వాత జరిగిన సోదాల్లో ఆక్సిస్ బ్యాంకు లో ఇలాంటి బోగస్ అకౌంట్లు బైటపడ్డాయి నిజం గా మేనేజ్ మెంట్ కి తెలియకుండా అకౌంట్లు ఓపెన్ అవుతాయా ?..ఒక వేళా అయినా మేనేజర్ స్థాయి అధికారి కి ఖచ్చితం గా ఈ అకౌంట్ ల గురించి పూర్తి సమాచారం ఉంటుంది.

యాజమాన్యాలు ఏమితెలియనట్టు కింది స్థాయి సిబ్బంది మీద నెట్టడం సమంజసమా ?మీ సంస్థ లో పని చేసే ఉద్యోగికి మీకు తెలియకుండా అక్రమం చేసే అవకాశం ఉంటుందా.. ఉదాహరణకు సత్యం కంప్యూటర్స్ ఉదంతాన్ని తీసుకొంటే ఒక్కసారిగా సత్యం ఫండ్స్ అన్నిటిని సిస్టర్ కన్సర్న్ కంపెనీ కి మళ్లించారు …ఆ రోజు రోడ్డున పడింది కూడా సగటు ఉద్యోగస్తుడే…అన్యాయం బైట పడితే బలైయ్యేది ప్రతిసారి మాములు ఉద్యోగే..ఇలా ఉత్తరాలు రాసి ఐస్ పెట్టె బదులు నిజాయతి గా వ్యవహరించాల్సిన అవసరం వుంది..ఉత్తరాలతో నమ్మకం రాదనేది జగమెరిగిన సత్యం ..