బాబు కాస్త ఆగుతావా?

0
82

 Posted April 29, 2017 at 12:29

babu baga busy movie release better to postpone because of bahubali 2
బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన అడల్ట్‌ సినిమా ‘హంటర్‌ చిత్రం తెలుగులో ‘బాబు బాగా బిజీ’గా రీమేక్‌ అయిన విషయం తెల్సిందే. కమెడియన్‌ కం డైరెక్టర్‌ అయిన శ్రీనివాస్‌ అవసరాల ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, టీజర్‌ మరియు ట్రైలర్‌లు ఇదో పచ్చి బూతు సినిమా అని తేలిపోయింది. బాలీవుడ్‌ హంటర్‌కు ఏమాత్రం తగ్గకుండా కుసింత మసాలాను దట్టించి మరీ తెలుగులో రీమేక్‌ చేశారు. ఈ సినిమాపై యూనిట్‌ సభ్యులకు విపరీతమైన నమ్మకం ఉంది. ఈ సినిమాలో ఉన్న అడల్ట్‌ కంటేంట్‌ తప్పకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని వారు ఆశిస్తున్నారు.

ఆ నమ్మకంతోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి, ఇటీవలే భారీ స్థాయిలో విడుదలైన ‘బాహుబలి 2’ సినిమాను ఢీ కొట్టేందుకు అంటే బాహుబలి విడుదలైన వారం రోజుల్లోనే విడుదలకు సిద్దం అయ్యింది. మే 7న ‘బాబు బాగా బిజీ’ చిత్రం విడుదల కాబోతుంది. అందుకోసం భారీగా పబ్లిసిటీ చేస్తున్నారు. బాహుబలి 2పై ప్రస్తుతం జనాల్లో పిచ్చ క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్‌తో రెండు వారాల పాటు ‘బాహుబలి 2’ బాక్సాఫీస్‌ వద్ద కుమ్మేయడం ఖాయం అని భావిస్తున్నారు. ఈ సమయంలోనే బాబు రావడం కాస్త విమర్శలకు దారి తీస్తుంది. బాహుబలి 2 రెండు వారాల పాటు భారీ వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించాలని ఆశిస్తున్న వారు బాబు బాగా బిజీ విడుదలైన తర్వాత బాహుబలికి కనీసం ఒకటి రెండు శాతం అయినా కలెక్షన్స్‌ తగ్గుతాయని, అందుకే బాబు కాస్త ఆగితే బాగుండు అనుకుంటున్నారు.