‘బాహుబలి 2’ ప్రతి రోజు ఆరు ఆటలు

0
108

Posted April 23, 2017 at 16:38


దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని ఆశిస్తున్నారు. ఈనెల 28న అత్యంత భారీగా ‘బాహుబలి 2’ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమాకున్న క్రేజ్‌తో తెలుగు రాష్ట్రాల్లో మొదటి పది రోజులు ఏకంగా 6 షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి దక్కింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేవలం నాలుగు షోలు మాత్రమే ప్రదర్శింప బడుతున్నాయి. అయిదవ షో కోసం చాలా కాలంగా సినీ వర్గాల వారు పోరాటం చేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రం అయిదవ షోకు ఓకే చెప్పింది. కాని అది ఇంత వరకు అమలులోకి వచ్చింది లేదు. కాని ‘బాహుబలి 2’ మాత్రం ఏకంగా ఆరు షోలు ప్రదర్శించేందుకు అనుమతి దక్కింది. మొదటి పది రోజులు ఆరు షోలు ప్రదర్శించనున్నారు. ఇక 11వ రోజు నుండి అయిదు ఆటలు ప్రదర్శించేందుకు అనుమతి వచ్చినట్లుగా తెలుస్తోంది.