‘బాహుబలి 2’ ఫస్ట్‌డే  టార్గెట్‌ ఎంతో తెలుసా?

0
118

Posted April 23, 2017 at 16:17

bahubali 2 first day target
టాలీవుడ్‌ జక్కన్న అద్బుత సృష్టి ‘బాహుబలి 2’ విడుదలకు రంగం సిద్దం అయ్యింది. మరో అయిదు రోజుల్లో కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ‘బాహుబలి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ ఉత్కంఠ మద్య అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతున్న విషయం తెల్సిందే. ఇంత భారీ స్థాయిలో విడుదల కాబోతున్న సినిమా అవ్వడంతో అందరి దృష్టి ప్రస్తుతం మొదటి రోజు కలెక్షన్స్‌పై ఉంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా సాధించని కలెక్షన్స్‌ను ‘బాహుబలి 2’ సాధిస్తుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు.

‘బాహుబలి 2’ మొదటి రోజు 100 నుండి 110 కోట్ల వరకు షేర్‌ను సాధించే అవకాశాలున్నాయని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఖచ్చితంగా 50 కోట్ల వరకు షేర్‌ను వసూళ్లు చేస్తుందని అంటున్నారు. ‘బాహుబలి 2’ సినిమాను మొదటి పది రోజులు ప్రతి రోజు ఆరు ఆటలను ప్రదర్శించబోతున్నారు. దాంతో ఖచ్చితంగా వంద కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. బాలీవుడ్‌లో కూడా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అందుకే బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాల వారు కూడా బాహుబలి 2 రికార్డులు బద్దలు చేస్తుందని నమ్ముతున్నారు.