‘బాహుబలి 2’ ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది

0
152

Posted April 22, 2017 at 17:43

bahubali 2 first review
స్టార్‌ హీరో సినిమా ఏది విడుదలవుతున్నా కూడా మొదటి రివ్యూ ఇచ్చేది యూఏఈ సెన్సార్‌ బోర్డు సభ్యుడు, యూకే ఇండియా సినీ విశ్లేషకుడు ఉమైర్‌ సంధు. గత కొంత కాలంగా ఈయన ఇస్తున్న దాదాపు అన్ని రివ్యూలు కూడా నిజం అవుతున్నాయి. అయితే కొన్ని మాత్రం చాలా అతి శయోక్తిగా ఇస్తూ ఉంటాడు. తాజాగా ‘బాహుబలి’ సినిమాకు ఈయన రివ్యూ ఇచ్చాడు. ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ కంటే రెండవ పార్ట్‌లో వంద శాతం అధికంగా మేటర్‌ ఉంది అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఏడు వేల స్క్రీన్స్‌లో విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’కు ఉమైర్‌ ఇచ్చిన రివ్యూ మరింత బలాన్ని ఇస్తుంది. మొదటి పార్ట్‌ కంటే డబుల్‌ కలెక్షన్స్‌ వసూళ్లు అయ్యేలా నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ సక్సెస్‌ను క్యాష్‌ చేసుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. దేశ వ్యాప్తంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు కన్నడంలో విడుదలవుతుందో లేదో అనే అనుమానాలున్నాయి. ఆ అనుమానాలకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది. అన్ని ఏరియాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విడుదలకు సిద్దం అయ్యింది.