‘బాహుబలి’ కన్నడ టెన్షన్‌ క్లీయర్‌

0
75

Posted April 22, 2017 at 16:28

bahubali 2 kannada tension cleared
‘బాహుబలి’ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈనెల 28న విడుదల కాబోతున్న జక్కన్న ‘బాహుబలి 2’ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదలకు అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో కన్నడ ప్రజలు ‘బాహుబలి 2’ను విడుదల కానిచ్చేది లేదు అంటూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్‌ వ్యాఖ్యలకు నిరసనగా కన్నడ ప్రజలు సినిమాను విడుదల కానిచ్చేది లేదు అంటూ ఆందోళనలు ఉదృతంగా చేస్తున్నారు. రాజమౌళి కన్నడ ప్రజలకు విజ్ఞప్తి చేసినా కూడా ఫలితం లేక పోవడంతో సత్యరాజ్‌ చివరకు రంగంలోకి దిగి క్షమాపణలు చెప్పడం జరిగింది.

కన్నడ ప్రజలు తన వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే క్షమించాలంటూ చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కన్నడంలో సినిమాను అడ్డుకుంటామని ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న కన్నడ రక్షణ సమితి వెనక్కు తగ్గింది. కర్ణాటకలో ‘బాహుబలి 2’ సినిమా విడుదలకు లైన్‌ క్లీయర్‌ అయ్యింది. దాంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కర్ణాటకలో సినిమా విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి పార్ట్‌ కన్నడంలో దాదాపు 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈసారి రెండవ పార్ట్‌ కర్ణాటకలో 30 కోట్లు వసూళ్లు సాధించడం ఖాయంగా భావిస్తున్నారు.