బాహుబలి ముందు హాలీవుడ్‌ సినిమాలు కూడా చిన్నబోయాయి

0
137

 Posted April 29, 2017 at 17:35

bahubali 2 movie cross hollywood movie fast & furious movie collections in canada
‘బాహుబలి 2’ ముందు నుండి అనుకున్నట్లుగానే రికార్డుల పరంపర కొనసాగిస్తుంది. అయితే అనుకున్నదాని కంటే ఈ సినిమా ఇంకాస్త అధనంగానే ఎక్కువ వసూళ్లు చేస్తున్నట్లుగా ట్రేడ్‌ విశ్లేషకుల ద్వారా తెలుస్తోంది. మొదటి రోజు ‘బాహుబలి 2’ 125 కోట్లు గ్రాస్‌ వసూళ్లు చేసినట్లుగా ఉమైర్‌ సంధు చెప్పుకొచ్చాడు. ఇక అమెరికా మరియు కెనడాలో ఏకంగా 26.5 లక్షల డాలర్లను వసూళ్లు చేసి వారెవా అనిపించుకుంది. ఈస్థాయిలో హాలీవుడ్‌ సినిమాలు కూడా వసూళ్లు చేయలేదని అమెరికా ఫిల్మ్‌ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు.

ఇటీవల హాలీవుడ్‌లో విడులైన ‘ది ఫేట్‌ ఆఫ్‌ ది ప్యూరియస్‌’ అనే సినిమా అమెరికా, కెనడాల్లో మొదటి రోజు 19.4 లక్షల డాలర్లను వసూళ్లు చేసింది. మొన్నటి వరకు ఇదే నెం.1 స్థానంలో ఉండేది. కాని ఇప్పుడు బాహుబలి సినిమా మరో ఆరు కోట్లు అదనంగా వసూళ్లు చేసి హాలీవుడ్‌ సినిమాల కంటే అధికంగా వసూళ్లు చేసి సత్తా చాటింది. అమెరికాలో ఎక్కువ హాలీవుడ్‌ సినిమాల సందడి ఉంటుంది. కాని బాహుబలి 2 సినిమా హాలీవుడ్‌ చిత్రాలనే క్రాస్‌ చేసి నెం.1 స్థానంను చేరిందంటూ సినిమా ఫలితం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.