అంతా బాహుబలి మయం.. మరో రెండు రోజులు కంటిన్యూ

0
91

 Posted April 28, 2017 at 19:24

bahubali 2 movie mania in india
గత కొన్ని రోజులుగా ‘బాహుబలి 2’ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ వారాలు, రోజలు, గంటలు లెక్కేసుకున్న ఫ్యాన్స్‌ నిన్న సాయంత్రం షోలతో సినిమా విడుదల అవ్వడంతో ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఒక్క ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా దాదాపు అందరు హీరోల ఫ్యాన్స్‌ కూడా ‘బాహుబలి 2’ ఫ్యాన్స్‌ అయ్యారు. సోషల్‌ మీడియాలో బాహుబలి చర్చలు ఏ రేంజ్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క సోషల్‌ మీడియాలోనే కాకుండా ప్రతి చోట కూడా బాహుబలి చర్చలు కనిపిస్తున్నాయి.

నిన్నటి నుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బాహుబలి సినిమా గురించి ఓ రేంజ్‌లో మాట్లాడుకుంటున్నారు. తాజాగా సినిమా విడుదలైన తర్వాత కూడా సినిమా ఫలితంపై మాట్లాడుకుంటున్నారు. ఈ క్రేజ్‌ మరో రెండు రోజులు అంటే శని మరియు ఆదివారం కూడా బాహుబలి మానియా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మూడు రోజుల పాటు అత్యధిక స్క్రీన్స్‌లలో సినిమాను ప్రదర్శించనున్నారు. 75 శాతం వసూళ్లు ఈ మూడు రోజుల్లోనే రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదటి రోజు 300 కోట్లకు పైగా వసూళ్లు వచ్చి ఉంటాయని ట్రేడ్‌ పండితులు అంటున్నారు.