ముంబయిలో ‘బాహుబలి 2’ ప్రీమియర్‌లు రద్దు

0
133

Posted April 27, 2017 at 17:14

bahubali 2 movie premiere show cancel in bollywood because of vinod khanna deadబాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా మరణించిన నేపథ్యంలో నేడు విడుదల ముంబయిలో సినీ ప్రముఖులు మరియు మీడియా వారి కోసం ‘బాహుబలి 2’ ప్రీమియర్‌ షోల వేసేందుకు ఏర్పాట్లు చేశారు. నిర్మాత కరణ్‌ జోహార్‌ ఇప్పటికే అందుకోసం ఆహ్వానాలు కూడా పంపడం జరిగింది. సినిమాను భారీగా ప్రమోట్‌ చేసేందుకు ప్రీమియర్‌ షోను ఉపయోగించుకోవాలని కరణ్‌ జోహార్‌ భావించాడు. అయితే వినోద్‌ ఖన్నా మరణించిన నేపథ్యంలో ప్రీమియర్‌ షోలు క్యాన్సిల్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్‌లో మొదటి పార్ట్‌ 100 కోట్లు విడుదల చేసిన నేపథ్యంలో రెండవ పార్ట్‌ అంతకు మించి వసూళ్లు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. హిందీలో ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. ఏ సౌత్‌ సినిమా ఇప్పటి వరకు నార్త్‌లో రాబట్టని కలెక్షన్స్‌ను రాబట్టబోతుంది. బాలీవుడ్‌ సినిమాలను తలదన్నే కలెక్షన్స్‌ను తీసుకు వచ్చేలా కరణ్‌ జోహార్‌ ప్రమోషన్‌ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో నటుడు వినోద్‌ ఖన్నా మరణించడం, షోలు క్యాన్సిల్‌ కావాడం జరిగింది. ఇది ‘బాహుబలి 2’కి బాలీవుడ్‌లో కాస్త చేదు విషయమే అని చెప్పుకోవాలి.