ఒక రోజు ముందే ‘బాహుబలి’ విడుదల

0
80

Posted April 26, 2017 at 19:21

bahubali 2 movie premiere shows on 27 april
దేశ వ్యాప్తంగా సినీ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘బాహుబలి 2’ చిత్రం మరో రెండు రోజుల్లో అంటే ఈనెల 28న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున ఆ రోజున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగి పోయాయి. 28వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున బెన్‌ ఫిట్‌ షోలను వేయాలని భావించారు. అయితే ప్రభుత్వం నుండి అనుమతి రాక పోవడంతో ఒక రోజు ముందే అంటే రేపే సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ముఖ్య పట్టణాల్లో కూడా ‘బాహుబలి 2’ పెయిడ్‌ ప్రీమీయర్‌ షోలు వేసేందుకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్‌ చేశారు. 27వ తారీకు సాయంత్రం నుండే సందడి స్టార్ట్‌ కాబోతుంది. ప్రీమియర్‌ షోల రూపంలో భారీగా దండుకునేందుకు నిర్మాతలు మరియు డస్ట్రిబ్యూటర్లు ప్లాన్‌ చేస్తున్నారు. గతంలో ఏ తెలుగు సినిమా కూడా ఒక రోజు ముందే భారీ సంఖ్య థియేటర్లలో ప్రీమియర్‌ షోలు పడ్డ దాఖలాలు లేవు. ఒక వేళ ప్రిమియర్‌ షోలు వేయాలి అంటే ఒకటి లేదా రెండు స్క్రీన్‌లలో ఉచితంగా చిత్ర నిర్మాత ప్రీమియర్‌ షోలు వేసేవారు. ఓవర్సీస్‌లో ప్రస్తుతం పెయిడ్‌ ప్రీమియర్‌ షోలు నడుస్తున్నాయి. కాని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇదే ప్రథమం కావడం విశేషం.