పాకిస్తాన్‌లో యుద్దంకు సిద్దమైన బాహుబలి

0
100

 Posted May 5, 2017 at 13:42

bahubali 2 movie release in pakistan
గత నెలలో విడుదలైన ‘బాహుబలి 2’ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి ఆరు రోజుల్లోనే ఏకంగా 800 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించి బాలీవుడ్‌ సినిమాలకు సైతం అందనంత ఎత్తున నిలిచింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ను ఊహించినప్పటికి ఇంత త్వరగా రికార్డులు బద్దలు అవుతాయని ఊహించలేదు. త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరడం ఖాయంగా తేలిపోయింది. బాలీవుడ్‌ సినిమాలు పాకిస్తాన్‌లో విడుదల కావడం సహజం. అయితే సౌత్‌ సినిమాలు మాత్రం పెద్దగా పాకిస్తాన్‌లో విడుదలైంది లేదు.

‘బాహుబలి 2’ సినిమా ఆ ట్రాక్‌ రికార్డును బ్రేక్‌ చేసేందుకు సిద్దం అయ్యింది. హిందీ వర్షన్‌ను పాకిస్తాన్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌కు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లతో ఈ విషయమై కరణ్‌ జోహార్‌ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇండియన్‌ సినిమాలకు పాక్‌లో మంచి గిరాకీ ఉంటుంది. అందుకే ‘బాహుబలి 2’ సినిమాకు సైతం ఖచ్చితంగా భారీ కలెక్షన్స్‌ రావడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు. పాకిస్తాన్‌ తర్వాత ఇంకా పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. విదేశీ భాషల్లో కూడా విజయం సాధిస్తే వెయ్యి కోట్లకు  మరో 200 కోట్లు అదనంగా వసూళ్లు చేసే అవకాశం ఉందని ట్రేడ్‌ పండితులు అంటున్నారు.