‘బాహుబలి 2’ మరో సంచలనం

  Posted October 17, 2016   bahubali 2 movie satellites rights record

బాహుబలి 2 మోత మొదలైంది. అదే రేంజ్ లో ఉందంటే.. ? కొడితే.. రికార్డులు బద్దలవ్వాల్సిందే. రిలీజ్ కు ముందే రికార్డులకు మోతమోగుతోంది. ఇప్పటికే ‘బాహుబలి 2’  ఓవర్సీస్ రైట్స్ రూ. 47కోట్లకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. తాజాగా, బాహుబలి2 హిందీ శాటిలైట్ రైట్స్ ను సోనీ టీవీ 51కోట్లకు దక్కించుకుంది. ఈ మొత్తానికి సర్వీస్ ట్యాక్స్ లు అదనం. అంతేకాదు.. నైజాం రైట్స్ లోనూ ఆఫ్ సెంచరీ వసూలు చేసింది. నైజాం రైట్స్ ను ఎసియన్ ఎంటర్ ప్రైజెస్ రూ. 50 కోట్లకు దక్కించుకొంది.

బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల శాటిలైట్స్ సైతం రూ. 20కోట్లకు మించడం లేదు. అలాంటిది ‘బాహుబలి2’ చిత్రానికి రూ. 51కోట్ల శాటిలైట్ పలకడం విశేషం. బాహుబలి చెక్కిన దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి సీక్వెల్ ని అంతకు మించి శ్రద్దగా చెక్కుతున్నాడు. ఇంకా కొన్ని ఏరియాల బిజినెస్ మిగిలివుంది. అక్కడ కూడా బాహుబలి సీక్వెల్ రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు.