‘బాహుబలి 2’ లీక్‌ అయిన వైరల్‌ వీడియో షాక్‌ ఇస్తుంది

0
89

Posted April 27, 2017 at 12:56

bahubali 2 movie video leaked in internet
 ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న ‘బాహుబలి 2’ చిత్రం నేటి సాయంత్రం నుండి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఎప్పుడెప్పుడు ‘బాహుబలి’ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా అని దేశ వ్యాప్తంగా సినీ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో తమిళ వర్షన్‌కు సంబంధించి చిన్న వీడియో బిట్‌ ఒకటి సోషల్‌ మీడియా వాట్సప్‌లో తెగ వైరల్‌ అవుతుంది. ఆ ఒక్క చిన్న బిట్‌తో స్టోరీ అంతా రివీల్‌ అవుతుంది. ఏ ఒక్కరు ఊహించని ఆ ట్విస్ట్‌ షాక్‌ ఇస్తుంది.

‘బాహుబలి’ మొదటి పార్ట్‌ చూసిన ప్రతి ఒక్కరు ఏదైతే ఊహించుకుంటారో, దానికి పూర్తి విరుద్దంగా జరుగుతుంది. ఆ వీడియోను చూసిన వారు సినిమాను ఇంకెప్పుడు చూస్తామా అని మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకు ఆ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా, మాహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా ‘బాహుబలి’ కాకుండా ‘భల్లాలదేవుడు’ చక్రవర్తిగా పటాభిషక్తుడు అవ్వడం. ఎందుకు బాహుబలి రాజు కాడు అనే విషయం ప్రస్తుతం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. అసు విషయం తెలియాలి అంటే మరి కొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చేస్తుంది.