కేక పెట్టిస్తున్న బాహుబలి-2 పోస్టర్

Posted January 26, 2017

bahubali 2 poster creating senstion
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా బాహుబలి. ప్రభాస్ కెరీర్ కు బిగ్గెస్ట్ మైల్ స్టోన్ గా చెబుతున్న ఈ మూవీ క్రియేట్ చేసిన వండర్స్ అన్నీ ఇన్నీ కావు. విడుదలై దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం విశేషం. బాహుబలిని.. కట్టప్ప ఎందుకు చంపేశాడు, రమ్యకృష్ణ చేసిన పాపం ఏంటి, అనూష్కని అంతలా హింసించడానికి కారణం ఏంటి… అనే అంశాల మీద సోషల్ మీడియాలో ఇప్పటికీ చర్చ జరుగుతోంది. దీంతో ఈ సినిమాకు సీక్వెలైన బాహుబలి.. ది కంక్లూజన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

bahubali 2 poster creating senstion
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర టీం అభిమానులకు మరింత యాంగ్జైటీ పెంచేందుకు రెండు పోస్టర్లను విడుదల చేసింది. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్స్ లో ఒకటి మాహిష్మతి ఏరియల్ వ్యూ కాగా మరొకటి ప్రభాస్-అనుష్కలు విల్లు ఎక్కుపెడుతున్న ఫోటో. అందులో వాళ్లిద్దరూ మూడు బాణాలను ఒకే సారి శత్రువుల మీదకి సంధించే ప్రయత్నం చేస్తున్నట్లు గా ఉంది. ఏది ఏమైనా చిత్ర బృందం విడుదల చేసిన ఈ ఫొటోలో ప్రభాస్, అనుష్కల లుక్ మాత్రం కేక పెట్టించేలా ఉంది కదూ.