అమెరికాలో ‘బాహుబలి 2’ ప్రభంజనం

0
112
bahubali 2 sensation in america

 Posted April 30, 2017 at 17:01bahubali 2 sensation in america

ప్రభాస్‌, అనుష్క జంటగా నటించిన ‘బాహుబలి 2’ చిత్రం తాజాగా విడుదలయింది. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలయ్యి భాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా విడుదలయిన అన్ని భాషల్లో కూడా ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. అత్యధిక వసూళ్లను రాబడుతూ గత చిత్రాల రికార్డులన్నీ కూడా బ్రేక్‌ చేస్తు వస్తోంది. అమెరికాలో కాస్త అనుమాన పడ్డ ఈ చిత్రం అక్కడ కూడా భారీ వసూళ్లను రాబడుతుంది. బాలీవుడ్‌ చిత్రాలు చేయని సందడిని సైతం ‘బాహుబలి’ అమెరికాలో చేస్తోంది. ఈ వారంలో ప్రముఖ తారలతో తెరకెక్కిన హాలీవుడ్‌ చిత్రం ‘ఫాస్ట్‌ అండ్‌ పూరియస్‌ 8’ మొదటి స్థానంలో ఉండగా ‘బాహుబలి 2’ చిత్రం రెండో స్థానంలో ఉంది.
 
హాలీవుడ్‌ చిత్రం ఈ శుక్రవారం నాటికి 5.1 మిలియన్‌ను రాబట్టగా ‘బాహుబలి 2’ చిత్రం 4.8 వసూళ్లను రాబట్టి పెద్దగా తేడా ఏమి లేదని నిరూపించుకుంది. ఇది వరకు ఈ తెలుగు, హిందీ చిత్రం చేయని సందడిని ‘బాహుబలి 2’ మూట గట్టుకుంది. అమెరికాలో రికార్డుల పర్వంను కొనసాగిస్తూ అత్యధిక వసూళ్లను రాబడుతుంది. ఈ భాష, ఆ భాష, ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ‘బాహుబలి 2’ చిత్రం విజయ ధంధిభి మోగిస్తుంది.