ఐటి దాడుల్లో దొరికిన బాహుబలి….

Posted November 12, 2016

Bahubali producers raided 60 croresఇన్ కం టాక్స్ అధికారుల దాడుల్లో బాహుబలి దొరికాడు. బ్లాక్ మనీ ని వైట్ చేసుకొనే పని లో ఉంటె వీరిని వెతికే పనిలో ఐ టి అధికారులు వున్నారు. బెంగళూరులోనూ అదే జరిగింది. రెండు రోజుల వ్యవధిలో కొంతమంది వ్యక్తులు సుమారు రూ.100 కోట్లను.. తమ ఇళ్లు, కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి ఒక్కొక్కరికీ రూ.2.5 లక్షల చొప్పున ఇచ్చి, వారితో బ్యాంకు ఖాతాల్లో జమ చేయించి. మళ్లీ వారి నుంచి చెక్కులు పుచ్చుకుని ఆ మొత్తాన్నీ తెల్ల ధనంగా మార్చేశారు.

ముందే ఈ పరిణామాల్ని ఊహించిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ దొంగ లావాదేవీల వ్యవహారాన్ని ఇట్టే పసిగట్టారు ఆ వ్యక్తులు ఎవరు, ఇదంతా ఎలా చేశారు, తదితర విషయాలను ఆరా తీయడంతో ముంబైకు చెందిన అగర్వాల్‌ పేరు బయటకొచ్చింది. ఆరా తీస్తే బాహుబలి కొనుగోలుదారు అని కూడా తేలింది

హుమ్మ ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదన్న నిర్ణయానికి వచ్చిన ఐటీ అధికారులు బెంగళూరులోని ఓ వ్యక్తితో అతడికి ఫోన్‌ చేయించారు. బ్లాక్‌ను వైట్‌ చేస్తామని ఆశపెట్టి వలలోకి లాగారు. కొన్ని ప్రాంతాల్లో ‘బాహుబలి’ సినిమా హక్కులు కూడా తీసుకుంటామని అతడితో చెప్పించారు. ఆ ఎరకు చిక్కిన అగర్వాల్‌ తన వద్ద ఉన్న నల్లధనాన్ని వెల్లడించాడు. ఆ సమాచారం ఆధారంగా పక్కా ప్రణాళికతో ముందుకు కదిలారు. హైదరాబాద్‌, ముంబై, బెంగళూరుల్లో ఏకకాలంలో 15 బృందాలు శుక్రవా రం దాడులు చేశాయి. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ కార్యాలయాలు సహా హైదరాబాద్‌లో ఆరు చోట్ల, ముంబై, బెంగళూరుల్లో 9 చోట్ల సోదా చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రికి రూ.55 కోట్ల దాకా నగదు బయటపడినట్లు తేలింది. ఐతే ఐటీ అధికారులు ధ్రువీకరించలేదు. బాహుబలి లావాదేవీల్లో చాలావరకు నగదులోనే జరగడంతో అదంతా బ్లాక్‌మనీగానే వారు భావిస్తున్నట్టు సమాచారం.

కానీ.. అది వైట్‌ మనీయేనని.. తమ సినిమాకు సంబంధించి అన్ని చెల్లింపులూ పద్ధతి ప్రకారమే చేస్తున్నామని బాహుబలి బృందం ఐటీ అధికారుల ముందు వాదించినట్లు తెలిసింది. ఈ వాదనకు ఐటీ అధికారులు ఒప్పుకోవట్లేదని, చిత్ర నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు, రికార్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ దాడుల్లో ఈడీ అధికారులు కూడా పాల్గొన్నారు.

[wpdevart_youtube]Ej2-SD8jhEw[/wpdevart_youtube]