బాహుబలి-2 రానా లుక్

Posted December 14, 2016

Bahubali Rana Bhallaladeva Look Releasedబాహుబలి సినిమాకు సంబందించిన ఓ లుక్ ఇప్పుడు సోషల్ సైట్స్ లో హల్ చల్ చేస్తుంది. భళ్లాలదేవగా నటించిన రానా లుక్ రివీల్ చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. రానా పుట్టినరోజు సందర్భంగా భళ్లాలదేవ లుక్ రిలీజ్ చేశాడు. బాహుబలి తనయుడి శివడు మీద కోపంతో ఊగిపోతున్న ఓల్డ్ గెటప్ లో భళ్లాదేవుడు అదరగొడుతున్నాడు. బాహుబలికి సంబందించిన ఏ న్యూస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు రానా లుక్ తో పండుగ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం షూటింగ్ ప్యాచ్ వర్క్ చేస్తున్న రాజామౌళి అండ్ టీం ఈ నెల చివరి కల్లా మొత్తం పూర్తి చేస్తుందట. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఓ పక్క స్పీడ్ అందుకుంది. సినిమాను అనుకున్న టైం కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఈ క్రమంలో సినిమా ప్రచారం కూడా భారీ రేంజ్లో చేయాలని పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నారు. మొదటి పార్ట్ తో తెలుగు సినిమా స్టామినా ఏంటో చాటిచెప్పిన జక్కన్న కన్ క్లూజన్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.