బుల్లితెరకు బాహుబలి.. సినిమాగా కాదు సీరియల్ గా..!

 

Bahubali Seriel Planning Vijayedra Prasad Tollywood Moviesఏంటి టైటిల్ చూసి షాక్ అయ్యారా.. బుల్లితెర మీదకు సీరియల్ గా బాహుబలి రావడం ఏంటి అంటే బాహుబలి సినిమాను డైలీ సీరియల్ రూపంలో కొద్ది కొద్దిగా వేస్తారా అని రకరకాల డౌట్లు రావొచ్చు. అయితే బాహుబలి రెండు పార్ట్ లకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాను సీరియల్ రూపంలో కూడా కథ రాస్తున్నాడట. సినిమాలో క్యారక్టర్స్ కన్నా సీరియల్ లో ఎక్కువ ఉంటాయి. అందుకే ఆ పనిలో నిమగ్నమయ్యాడట. ఇక ఈ సీరియల్ కూడా డైలీ వీక్లీ లా కాకుండా హాలీవుడ్ స్టైల్ లో ఉంటుందట.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ మాదిరి హాలీవుడ్ సీరియల్ లా ఒకేసారి 10 నుండి 15 ఎపిసోడ్ తో ఒక కథను ఫినిష్ చేసి ఇక అదే పాత్రలతో మరో కథతో మరో 15 ఎపిసోడ్స్ ఇలా సినిమా రెండు భాగాలను కథలుగా చేస్తారట. ఐడియా బాగున్నా సినిమాకు వాడిన సెట్స్ అన్ని మళ్లీ సీరియల్ కు వాడాలిగా.. అయినా సీరియల్ కు కూడా రాజమౌళి డైరెక్ట్ చేస్తాడా.. ఆయనకు అంత టైం ఉంటుందా అన్న డౌట్స్ రేజవుతున్నాయి. మరి వీటన్నిటికి సమాధానం వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

ప్రస్తుతం అయితే బాహుబలి టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది ఓ పక్క షూట్ చేస్తూనే మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కు సంబందించిన పనులు జరుగుతున్నాయి. అసలైతే అనుకున్నట్టుగా జరిగితే 2017 ఏప్రిల్ 18న సినిమా రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు.