షారూఖ్ నటించలేదు… బాహుబలి టీం క్లారిటీ

0
63

Posted February 14, 2017

bahubali team said shahrukh khan not acting in bahubali 2 movieబాహుబలి సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా గురించి రోజుకోరకంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక బాహుబలి-2 రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ వార్తలు మరింత పెరిగాయి. అందులో భాగంగానే బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్.. బాహుబలి-2లో నటించాడంటూ వార్తలు కూడా వచ్చాయి. సినిమాను బాలీవుడ్ లో కూడా హైప్ చేయడానికే రాజమౌళి… షారూఖ్ ను ఇందులో నటింపజేశాడని, ఈ సినిమాలో షారూఖే విలనని…ఇలా ఎవరికి తోచినట్లు వారు రకరకాలుగా చెప్పుకుంటున్నారు.

ఈ వార్తలన్నింటినీ గమనించిన బాహుబలి టీమ్ ఆ రూమర్లకు చెక్ పెట్టింది. “షారుఖ్ మా  సినిమాలో నటించాలని మాకూ ఉంది. అలా ఎవరు మాత్రం కోరుకోరు? కానీ ఈ వార్త మాత్రం పూర్తిగా పుకారేనని,  ఇందులో ఎంత మాత్రం నిజం లేదు’ అంటూ ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చింది. దీంతో కొంతమంది అభిమానులకు క్లారిటీ వచ్చినా మరి కొందరు మాత్రం తమ అభిమాన హీరో షారూఖ్ నటించలేదు అనే చెప్పేసరికి కాస్త నిరాశపడ్డారు.