బాలయ్య 102 అధికారిక ప్రకటన

0
99

Posted May 10, 2017 at 17:00

balakrishna 102 movie announcement
నందమూరి బాలకృష్ణ ఈ వయస్సులో కూడా యమ స్పీడ్‌గా సినిమాలు చేస్తూ యంగ్‌ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ఇటీవలే తన 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ప్రస్తుతం 101వ సినిమాను చేసే పనిలో ఉన్నాడు. పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో బాలయ్య 101వ సినిమా తెరకెక్కుతుంది. సెప్టెంబర్‌లోనే ఆ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే పూరి ప్రకటించాడు. భారీ అంచనాలున్న ఆ సినిమా ఇంకా షూటింగ్‌ దశలోనే ఉండగా బాలయ్య తన 102వ సినిమాను అధికారికంగా ప్రకటించాడు.

బాలయ్య 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదలైన వెంటనే తమిళ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ను కాకుండా పూరితో తన 101వ సినిమాను మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆ సినిమాకు లైన్‌ క్లీయర్‌ అయ్యింది. తమిళంలో పలు చిత్రాలను తెరకెక్కించి సూపర్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవికుమార్‌ చాలా కాలం క్రితమే బాలయ్య కోసం ఒక మంచి స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడు. అయితే అది తెర రూపం దాల్చేందుకు ఇంత సమయం అయ్యింది. జులై 10 నుండి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగబోతున్నట్లుగా తెలుస్తోంది. సి కళ్యాణ్‌ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. జయసింహా అనే టైటిల్‌ను ఇప్పటికే ఈ సినిమాకు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఇదే సంవత్సరంలో సినిమా విడుదలయ్యేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా కళ్యాణ్‌ చెప్పుకొచ్చాడు.