ఆసక్తి లేనప్పుడు వదిలేయ్‌ బాలయ్య..!

Posted April 20, 2017 at 16:54

balakrishna forced to mokshagna to movie side
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా గత కొంత కాలంగా ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం ప్రమోషన్‌ సందర్బంగా బాలయ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం మోక్షజ్ఞ సినిమాను ప్రారంభించి వచ్చే సంవత్సరంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చెప్పుకొచ్చాడు. అందుకోసం స్క్రిప్ట్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లుగా కూడా చెప్పుకొచ్చాడు. ఏ దర్శకుడు మోక్షజ్ఞను పరిచయం చేయబోతున్నాడు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

ఒక వైపు బాలయ్య తన కొడుకు సినిమా కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మోక్షజ్ఞ మాత్రం సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవలన తనకు అత్యంత సన్నిహితులతో తాను బిజినెస్‌మెన్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను. కాని నాన్న మాత్రం నన్ను హీరోగా చూడాలని ఆశ పడుతున్నాడు. అందుకే నేను హీరోగా పరిచయం అయ్యేందుకు సిద్దం అవుతున్నాను. అయితే హీరోగా నటిస్తూనే బిజినెస్‌ వ్యవహారాలు చూసుకోవాలనేది నా కోరిక అంటూ మోక్షజ్ఞ చెప్పుకొచ్చాడు. వారసుడిని ప్రతిష్టాత్మకంగా, తన పరువుగా భావించి మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకు రావాలని బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడికి ఇష్టం లేకున్నా కూడా బాలయ్య బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతుందని సినీ వర్గాల్లో కొందరు అంటున్నారు. ఆసక్తి లేకుంటే వదిలేయ్‌ బాలయ్య, బలంగా రుద్దినంత మాత్రాన లేని ఆసక్తి రాదని కొందరు బాలయ్యకు సన్నిహితులు చెబుతూ వస్తున్నారు.