బాలయ్య ‘వ్యవసాయ పనులు’ నవంబర్ నుంచి మొదలు

0
129

Posted October 7, 2016

  balakrishnan krishna vamshi raithu movie shooting start november

నందమూరి బాలయ్య ‘రైతు’గా మారబోతున్న విషయం తెలిసిందే. దర్శకుడు కృష్ణవంశీ చెప్పిన ‘రైతు’ కథ బాలయ్య బాగా నచ్చేసింది. ఈ చిత్రాన్ని బాలయ్య వందో చిత్రంగా తీసుకొచ్చేందు ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే, ఇంతలో దర్శకుడు క్రిష్ అమరావతి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ కథతో బాలయ్య ముందుకు రావడం.. క్రిష్ కథకి బాలయ్య కనెక్ట్ కావడం జరిగింది. దీంతో.. వంశీ ‘రైతు’ కనుమరుగైనట్టే అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో.. ‘రైతు’ ఉంటుందని ఇటీవలే బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. తాను కచ్చితంగా వ్యవసాయం చేస్తానని.. ‘రైతు’ చిత్రం తన 101వ చిత్రంగా రానుందని క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం బాలయ్య క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వందో చిత్రం ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో బాలయ్య సరసన శ్రియ జతకట్టనుంది. తల్లిగా అలానాటి హీరోయిన్ హేమమాలిని కనిపించనుంది. ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తయ్యింది. న‌వంబ‌ర్‌ లో మొత్తం షూటింగ్
పూర్తికానుంది.

దీంతో.. వెంటనే వంశీ ‘రైతు’ని నవంబర్ లోనే ప్రారంభించాలని బాలయ్య డిసైడ్ అయినట్టు సమాచారమ్. అంతేకాదు.. డిసెంబర్ నుంచి ‘రైతు’ సెట్స్ పైకి
వెళ్లనుంది. ప్రస్తుతం కృష్ణ వంశీ ‘రైతు’కి తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. వందో చిత్రం కథ కోసం కథలు విన్నప్పుడు బాలయ్య నచ్చిన మరో కథ
కూడా ఉంది. అదే “రామారావు గారు”. ఈ కథతో బాలయ్యని మెప్పించాడు దర్శకుడు అనిల్ రాఘవపూడి. ఈ చిత్రం కూడా బాలయ్య 102వ చిత్రంగా రానుందని సమాచారమ్.