బాలయ్య 101 వ సినిమా డీటెయిల్స్..

0
168

Posted September 26, 2016

 balayya 101 raithu movie details

ప్రతిష్టాత్మక 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి పూర్తి కావొస్తుండటంతో ..101 వ చిత్రం మీద దృష్టి పెట్టాడు బాలయ్య.ఈ సినిమా మరేంటో కాదు ..100 వ సినిమా రేసులో నిలిచిన రైతు.కథ సాక్షి రామ్ అందిస్తున్నారు.దర్శకుడు క్రియేటివ్ జీనియస్ కృష్ణ వంశీ..ఇక నిర్మాతలు బాలయ్యతో లెజెండ్ తీసిన 14 రీల్స్ వారేనట.మరోసారి ఇంత క్రేజీ కాంబినేషన్ కుదరడానికి కారణం ఏంటో తెలుసా? కథ.

ఈ చిత్ర కథ విన్న వెంటనే హీరో బాలకృష్ణ తో పాటు దర్శకనిర్మాతలు ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందా అన్న కుతూహలంతో ఎదురు చూస్తున్నారట.కృష్ణవంశీ నక్షత్రం,బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణి పూర్తి కాగానే కొత్త సినిమా రైతు ప్రీ ప్రొడక్షన్ పనులు,షూటింగ్ వెంటవెంటనే జరిగిపోతాయని 14 రీల్స్ నుంచి అందుతున్న సమాచారం.