పవన్ కాబోయే సీఎం అట!!!

Posted January 28, 2017

bandla ganesh said pawan kalyan become a chief minister of andhra pradeshపవన్ కళ్యాణ్ ఏపికి కాబోయే సీఎం అని తెలుగు సినీ పరిశ్రమలో బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ జోస్యం చెప్పాడు. గత కొంతకాలంగా తెరమరుగైన బండ్ల ఇటీవల ఓ మీడియాకు ఇంటర్ వ్యూ ఇచ్చిన సంగతి తెలసిందే. ఇంటర్ వ్యూ సందర్భంగా బండ్ల..  పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపాడు.

రాజకీయాల్లో పవన్ ఓ సంచలనం సృష్టిస్తాడని అన్నారు. అంతేకాకుండా  పవన్ ఏపికి సీఎం అవుతాడని, అది ఆంధ్ర ప్రజల అదృష్టమని జోస్యం చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఓ శక్తి అని.. అతన్ని ఎవరు ఆపలేరన్నాడు. ఇక పవన్ స్పీచ్ లకు త్రివిక్రం స్క్రిప్ట్ అందిస్తారని వచ్చిన వాదన గురించి మాట్లాడుతూ పని పాట లేని వారు చేసే  ఇటువంటి  కామెంట్లకు ఎవరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నాడు.  త్వరలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ మరి బండ్ల జోస్యం ప్రకారం సీఎం అవుతాడేమో వేచి చూడాలి.