రవితేజ దారుణంగా మోసపోయాడు: బండ్ల గణేష్

Posted January 27, 2017

bandla ganesh says i cheated to ravi teja
బండ్ల గణేష్…తెలుగు సినీ పరిశ్రమలో బడా నిర్మాత. కమడియన్ గా కెరీర్ ప్రారంభించి.. స్టార్ ప్రొడ్యూసర్ రేంజ్ ను అందుకున్నాడు. గత కొంతకాలంగా అడ్రస్ లేకుండాపోయిన ఈ నిర్మాత తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో చాలానే సంగతులు చెప్పుకొచ్చిన బండ్ల… రవితేజను దారుణంగా మోసం చేశానని తెలిపాడు.

రవితేజ ఎంతో ఇష్టపడి తన దగ్గర ఓ పొలం కొనుక్కున్నాడని, అయితే ఆ అమ్మకంలో రవిని తాను మోసం చేశానని తెలిపాడు. అలాగే తన దేవుడు పవన్‌ కల్యాణ్‌కు ఎవరూ సహాయం చేయనవసరం లేదని, తన సమస్యను తానే పరిష్కరించుగోలడని అన్నాడు. పవన్ కు సంస్కారం ఎక్కువ. ఆయనొక రేర్ పీస్, సమ్ టైమ్స్ గాడ్ మేక్ ఏ రేర్ పీస్ అంటూ పవన్ ని కొనియాడాడు. జూనియర్‌ ఎన్టీయార్‌ తో విబేధాలు రావడానికి బాద్ షా సినిమా వల్ల తాను నష్టపోవడమేనన్నాడు. తన బ్యాడ్ లక్ వల్ల ఓ దర్శకుడితో పనిచేశానని, ఆ దర్శకుడు రాత్రంతా మందు కొడుతూ, డ్రగ్స్‌ తీసుకుంటూ గడుపుతాడని మండిపడ్డాడు. అయితే ఆ దర్శకుడి పేరు చెప్పకుండానే బండ్ల మాటదాటేశాడు.