ఛార్జింగ్‌ తీసేదాక ఊరుకోదు..

Posted November 16, 2016

Battery Full Alarm is a FREE battery Overcharging Protector App.
మొబైల్‌కి ఛార్జింగ్‌ పెట్టడమనేది నిత్యజీవితంలో భాగమైపోయింది.. ఒక్క రోజు పెట్టకపోయినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది.. అలానే రాత్రంతా పెడదామంటే బ్యాటరీ లైఫ్‌ పోతుంది.. బయటకు వెళ్లే కాసేపట్లో బ్యాటరీ ఫుల్‌ కాదు.. అలాంటివారికి బ్యాటరీ అలారం ఆండ్రాయిడ్‌ యాప్‌ చాలా ఉపయోగపడుతుంది. ఛార్జింగ్‌ పెట్టి ఎదైనా పనిచూసుకుంటూ ఉంటే.. బ్యాటరీ ఫుల్‌ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే కచ్చితంగా మొబైల్‌ ఓపెన్‌ చేసి చూడాల్సింది.. ఏదైన ముఖ్యమైన పని చేస్తున్నా చెక్‌ చేయాలంటే మొబైల్‌ దగ్గరకు వెళ్లాల్సిందే.. కొన్ని సందర్భాల్లో అయితే బ్యాటరీ 100 శాతం అయినా అలానే ఛార్జింగ్‌ పిన్‌ కనెక్ట్‌ చేసే ఉంటుంది. దాంతో కొత్త మొబైల్‌ అయినా సరే బ్యాటరీ లైఫ్‌ కోల్పోతుంటాయి.. బ్యాకప్‌ వచ్చే సమయం కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ బాధలకు చెక్‌ చెప్పేలా బ్యాటరీ అలారం యాప్‌ సమర్థంగా వాడుకోవచ్చు… బ్యాటరీ నిండిన వెంటనే అలారం ఇస్తుంది. అయినా పట్టించుకోకుంటే మరో అయిదు నిమిషాలకు మళ్లీ ఇస్తుంది.. ఇలా ఛార్జింగ్‌ తీసేవరకు సంకేతాలు ఇస్తూనే ఉంటుంది. దాంతో నిద్రపోయేవారు సైతం లేచి ఛార్జర్‌ తీసేందుకు ఉపయోగపడుతుంది.
బ్యాటరీ శాతం ఎంచుకోవచ్చు..

బ్యాటరీ 100 శాతం అయ్యేవరకు కాకుండా 70 శాతమని లేదా 90 శాతమని ఇలా మనకు నచ్చిన విధంగా అలారం మోగాలో పెట్టుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలారం టోన్‌తోపాటు వాయిస్‌ సూచనలు రావాలో వద్దో ఎంచుకోవచ్చు… సైలెంట్‌లో ఉన్నప్పుడు, వైబ్రషన్‌ మోడ్‌ ఉంటే.. ఛార్జింగ్‌ ప్రాగెస్‌ బార్‌ ఉండాలా వద్దా అనేది మనమే కస్టమైజ్‌ చేసుకోవచ్చు…

Battery Full Alarm is a FREE battery Overcharging Protector App.
దేనితో కనెక్ట్‌ చేశామో గుర్తిస్తుంది
చార్జింగ్‌ కెన్ట్‌ చేయాగానే యూఎస్‌బీతో చేశారా.. డైరెక్ట్‌ చార్జరా అనేది చూపిస్తుంది.. ఎంత వోల్టేజ్‌ వస్తుంది అనే వివరాలు చూపిస్తుంది. ఛార్జింగ్‌ సమయంలో ఎక్కువ వేడెక్కి పేలేప్రమాదాన్ని నివారించేందుకు ఎప్పటికప్పుడు మొబైల్‌ ఉష్ణోగ్రత స్ర్కీన్‌పై సూచిస్తుంది. దానితోపాటు ఛార్జింగ్‌ త్వరగా ఎక్కేందుకు ఆటోమెటిక్‌గ్గా బ్లూటూత్‌, వైఫై, వైబ్రేషన్‌, స్ర్కీన్‌ బ్రైట్‌నెస్‌, స్ర్కీన్‌ టైమ్‌ అవుట్‌ ఎలా ఉండాలనేది సెట్‌ చేసుకోవచ్చు.. వీటన్నింటి వల్ల త్వరగా ఛార్జింగ్‌ ఎక్కడంతోపాటు.. సమయానికి మనల్ని ఎలర్ట్‌చేసి బ్యాటరీ లైఫ్‌ని కాపాడుతుంది. ఈ యాప్‌ కావాలంటే https://goo.gl/5ngZXW ఈ షార్ట్‌ లింక్‌ ద్వారా నేరుగా యాప్‌ పేజ్‌కి వెళ్లొచ్చు..

  • శ్రీ